అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణ (Armoor Town) శివారులో శనివారం చోటుచేసుకుంది. ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ (Armoor SHO Satyanarayana Goud) తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం (Velpur mandal) పడగల్ ఎక్స్ రోడ్లోని వడ్డెర కాలనీలో భార్యభర్తలు అలకుంట రవితేజ, శోభ నివాసముంటున్నారు. వీరికి మూడునెలల క్రితం వివాహం జరిగింది.
Armoor | పట్టణ శివారులో..
ఆర్మూర్ పట్టణ శివారులోని ఓ వెంచర్లో భార్యభర్తలు శనివారం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. స్పందించిన 108 సిబ్బంది వారిని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్హెచ్వో తెలియజేశారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.