Covid-19 virus | దడ పుట్టిస్తున్న కరోనా.. వెయ్యి దాటిన యాక్టివ్​ కేసులు..

అక్షరటుడే, న్యూఢిల్లీ: Covid virus : దేశంలో కొవిడ్​ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. హాంకాంగ్(Hong Kong), సింగపూర్(Singapore) తర్వాత భారత్​(Bharath)(India)లోనూ కొవిడ్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్​ బారిన పడినవారి సంఖ్య 1,009కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 752 కేసులు నమోదైనట్లు పేర్కొంది. అత్యధిక కొవిడ్​ కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళ(Kerala)లో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి చేరింది. గత 24 […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Covid virus : దేశంలో కొవిడ్​ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. హాంకాంగ్(Hong Kong), సింగపూర్(Singapore) తర్వాత భారత్​(Bharath)(India)లోనూ కొవిడ్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్​ బారిన పడినవారి సంఖ్య 1,009కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 752 కేసులు నమోదైనట్లు పేర్కొంది.

అత్యధిక కొవిడ్​ కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళ(Kerala)లో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి చేరింది. గత 24 గంటల్లో అక్కడ 335 కొత్త కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

Covid virus : దేశ రాజధానిలోనూ..

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోనూ కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ క్రియాశీల కేసులు 104 ఉన్నాయి. వారం రోజుల్లో ఢిల్లీలో 99 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో 153 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కరోనా కేసులు సోమవారం నాటికి 209కు చేరుకున్నాయి.

గుజరాత్​(Gujarat)లో 83, కర్ణాటక(Karnataka)లో 47, ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh)లో 15, పశ్చిమబెంగాల్​(West Bengal)లో 12 నమోదయ్యాయి. కాగా, థానె(Thane)లోని ఛత్రపతి శివాజీ మహరాజ్​ కల్వా ఆస్పత్రి(Chhatrapati Shivaji Maharaj Kalwa Hospital)లో కొవిడ్​తో 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Covid virus : కొత్త వేరియంట్లు..

తాజాగా కొవిడ్​ సోకిన వారిని విశ్లేషించగా.. రెండు కొత్త వేరియంట్లు(new variants) NB.1.8.1, LF.7 ప్రబలుతున్నట్లు గుర్తించారు. ఈ రెండు కొత్త వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సైతం స్పందించింది. ఈ రెండు కొత్త వేరియంట్లు కూడా తమ పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...