Homeతాజావార్తలుCorona Remedies | స్టాక్‌ మార్కెట్లోకి కరోనా.. ఇన్వెస్టర్లకు పండుగే!

Corona Remedies | స్టాక్‌ మార్కెట్లోకి కరోనా.. ఇన్వెస్టర్లకు పండుగే!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి ‘కరోనా’ రంగ ప్రవేశం చేస్తోంది. సోమవారంనుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. ఇది ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తుందని భావిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Corona Remedies | ఫార్మాస్యూటికల్ (Pharmaceutical) రంగానికి చెందిన అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కరోనా రెమెడీస్‌(Corona Remedies).. 2004లో ప్రారంభమైంది. ఈ కంపెనీ మహిళల ఆరోగ్య సంరక్షణ(Women’s health care), కార్డియో డయాబెటో, నొప్పి నిర్వహణ, యూరాలజీ ఇతర చికిత్సా రంగాలలో ఔషధ ఉత్పత్తుల తయారీ, వ్యాపారం మరియు మార్కెటింగ్‌లో నిమగ్నమై ఉంది.

కంపెనీ తయారీ సౌకర్యాలు సోలన్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) మరియు భయ్లా (అహ్మదాబాద్‌, గుజరాత్‌) వద్ద ఉన్నాయి. ఇది భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ఫార్మా కంపెనీలలో ఒకటిగా ఉంది. మహిళల ఆరోగ్యం, హృద్రోగాలు, మధుమేహం, చర్మవ్యాధులు వంటి విభాగాలకు సంబంధించిన ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రస్తుతం సంస్థకు 67 బ్రాండ్‌లున్నాయి. దేశవ్యాప్తంగా పటిష్టమైన మార్కెట్‌ నెట్‌వర్క్‌ ఉంది. 2024 డిసెంబర్‌ 31 నాటికి దేశంలోని టాప్‌ 30 ఫార్మా కంపెనీల్లో రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా గుర్తింపు పొందింది. ఈ ఐపీవో(IPO) పరిమాణం రూ. 655.37 కోట్లు. ఇది పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌.

Corona Remedies | ఆర్థిక పరిస్థితి..

2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,020.93 కోట్ల రెవెన్యూ(Revenue) ద్వారా రూ. 90.50 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రూ. 1,202.35 కోట్లకు పెరగ్గా.. నికర లాభం రూ. 149.43 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆస్తులు రూ. 830.58 కోట్లనుంచి రూ. 929.86 కోట్లకు పెరిగాయి.

Corona Remedies | ధరల శ్రేణి..

కంపెనీ ధరల శ్రేణి(Price band)ని రూ. 1,008 నుంచి రూ. 1,062 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 14 షేర్లున్నాయి. ఐపీవోలో పాల్గొనాలనుకునే రిటైల్‌ పెట్టుబడిదారులు ఎగువ ధరల శ్రేణి వద్ద కనీసం రూ. 14,868 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్‌ల కోసం బిడ్‌ వేయొచ్చు.

Corona Remedies | ఐపీవో తేదీలు..

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (IPO Subscription) సోమవారం ప్రారంభమవుతుంది. బుధవారం వరకు కొనసాగుతుంది. 11న రాత్రి షేర్లను కేటాయిస్తారు. 15న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

Corona Remedies | కోటా, జీఎంపీ..

క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ. 305గా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలో 28 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Must Read
Related News