Portable AC | పోర్టబుల్​ ఏసీలతో చల్లచల్లగా.. కూల్​కూల్​
Portable AC | పోర్టబుల్​ ఏసీలతో చల్లచల్లగా.. కూల్​కూల్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Portable AC | వేసవి summer లో బయటకు వెళ్లాలంటనే ప్రజలు భయపడతారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోత భరించలేక అనేక మంది కూలర్లు(coolers), ఏసీ (ac)లను వినియోగిస్తారు. ప్రస్తుతం భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లడం లేదు. ఇతర ప్రాంతాలకు తరుచూ తిరిగే వారికి, అద్దె ఇళ్లలో ఉండే వారికి ఏసీలు బిగించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి వారి కంపెనీలు పోర్టబుల్​ ఏసీలను Portable AC తీసుకొచ్చాయి. చిన్నగా ఉండే వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకు వెళ్లొచ్చు. ఇన్‌స్టాలేషన్‌కు గోడలు డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, అద్దె ఇళ్లు లేదా చిన్న స్థలాలకు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆయా కంపెనీలు అమెజాన్​లో సూపర్​ డీల్స్​ పోర్టబుల్​ ఏసీలను విక్రయిస్తున్నాయి. వాటి వివరాలు..

క్రూయిస్ 1 టన్ పోర్టబుల్ ఏసీ 4-ఇన్-1 ఫంక్షనాలిటీని అందిస్తుంది. ఏసీ, డీహ్యూమిడిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, మరియు ఫ్యాన్. దీని ధర రూ.32 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంది. ఆయా కార్డులపై డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

బ్లూ స్టార్ 1 టన్ పోర్టబుల్ ఏసీ 100% కాపర్ కాండెన్సర్‌తో వస్తుంది. ఇందులో యాంటీ-బాక్టీరియల్ సిల్వర్ కోటింగ్, కంఫర్ట్ స్లీప్ మోడ్, ఆటో-కూల్, ఫ్యాన్, డ్రై మోడ్‌లు ఉన్నాయి. 100-150 చదరపు అడుగుల గదులకు అనుకూలంగా ఉంటుంది. అమెజాన్​ సమ్మర్​ సేల్​లో భాగంగా రూ.39 వేలకు లభిస్తోంది.

లాయిడ్ 1.5 టన్ పోర్టబుల్ ఏసీ అధిక కూలింగ్ కెపాసిటీతో (450 చదరపు అడుగుల వరకు), ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. ఇది 52°C వరకు వేడిలో కూడా పనిచేస్తుంది. దీని ధర రూ.44వేలు కగా.. రూ.రెండు వేల డిస్కౌండ్​ లభిస్తోంది.