అక్షరటుడే, వెబ్డెస్క్:BDL Notifications | హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(Bharat Dynamics Limited)లో కాంట్రాక్ట్ పద్ధతిన పలు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ (Notification) విడుదలయ్యింది. ట్రెయినీ ఇంజినీర్, ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్ (Diploma assistant) పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందామా..
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 212.
పోస్టులవారీగా వివరాలు : ఎలక్ట్రానిక్స్(Electronics), మెకానికల్ విభాగాలలో ట్రైనీ ఇంజినీర్ 100, ట్రైనీ ఆఫీసర్ 12, డిప్లొమా అసిస్టెంట్ 90, ట్రైనీ అసిస్టెంట్ 10 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(Degree) ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి : ఆగస్టు 10 నాటికి 28 నుంచి 33 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
వేతనం : నెలకు ట్రైనీ ఇంజినీర్(Trainee engineer), ఆఫీసర్ పోస్టులకు రూ. 29 వేల నుంచి రూ. 38,500,
డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్ పోస్టులకు రూ. 24,500 నుంచి రూ. 29 వేలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : ఆగస్టు 10.
రాత పరీక్ష తేదీ : ఆగస్టు 24.
పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: https://www.bdlindia.in