Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్(Sriram Sagar Project)​కు ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి శుక్రవారం 3,68,226 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. శనివారం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 2,13,285 క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు 39 గేట్లు ఎత్తి 1,97,010 క్యూసెక్కులు గోదావరి(Godavari)లోకి విడుదల చేస్తున్నారు. Sriram Sagar | నిండుకుండలా జలాశయం శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్(Sriram Sagar Project)​కు ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయంలోకి శుక్రవారం 3,68,226 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. శనివారం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 2,13,285 క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు 39 గేట్లు ఎత్తి 1,97,010 క్యూసెక్కులు గోదావరి(Godavari)లోకి విడుదల చేస్తున్నారు.

Sriram Sagar | నిండుకుండలా జలాశయం

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. జలాశయం సామర్థ్యం 80.5 (1091 అడుగులు) టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తం నీరు నిల్వ ఉంది. డ్యామ్​ నుంచి వరద గేట్ల ద్వారా 1,97,010 క్యూసెక్కులు, వరద కాలువకు 6,735, ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేలు, కాకతీయ కాలువ(Kakatiya Canal)కు 4 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా.. ఆవిరి రూపంలో 709 క్యూసెక్కులు పోతోంది. మొత్తం ఔట్​ ఫ్లో 2,13,285 క్యూసెక్కులుగా ఉంది. ఇన్​ఫ్లో, ఔట్​ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది.

Sriram Sagar | కొనసాగుతున్న విద్యుత్​ ఉత్పత్తి

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ దిగువన గల జల విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. నాలుగు టర్బయిన్ల ద్వారా జెన్​కో అధికారులు(Genco Officers) కరెంట్​ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు 39 వరద గేట్లు ఎత్తడంతో జలసవ్వడులు తిలకించడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. నేడు శనివారం, రేపు ఆదివారం పర్యాటకులు భారీ సంఖ్యలో రానున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...