114
అక్షరటుడే, కామారెడ్డి: Bhiknoor | అతివేగంతో ప్రయాణిస్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటన భిక్కనూరు మండలం (Bhikkanoor mandal) సిద్ధరామేశ్వర నగర్ శివారులో ఆదివారం చోటుచేసుకుంది.
Bhiknoor | కొద్దిదూరం కారును ఈడ్చుకెళ్లిన కంటైనర్..
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరానికి (Nizamabad City) చెందిన పద్మ, సృజన్ మోహన్ రెడ్డి దంపతులు కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ కారును ఢీకొంది. కారును కొద్దిదూరం వరకు కంటైనర్ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలను స్థానికులు సురక్షితంగా బయటకు లాగారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.