అక్షరటుడే, బాన్సువాడ : Constable Kishtaiah | కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగం మరువలేనిదని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ (Banswada) పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిష్టయ్యలాంటి మహనీయుల త్యాగస్ఫూర్తి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలకు దారి దీపమని పేర్కొన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, జిన్నా రఘు, లింగం, కనుకుట్ల రాజు, నరేష్, ఎజాజ్, తదితరులు పాల్గొన్నారు.
