అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Police | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోలెక్స్ వాచ్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ నిందితుడి ఇంట్లో వాచ్‌ను పోలీస్ కానిస్టేబుల్ (Police constable) కాజేయడం చర్చనీయాంశం అయింది. తాజాగా సదరు కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బత్తిని శశికాంత్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారిని (IPS officer) అంటూ బిల్డర్ల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నాడు. భూములు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని, అడిగితే పలువురిని బెదిరించాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో ఫిల్మ్ నగర్ పోలీసులు నకిలీ ఐపీఎస్ అధికారి శశికాంత్‌ను (fake IPS officer Shashikant) అరెస్ట్ చేశారు. అనంతరం షేక్‌పేట్‌లోని అతడు ఉండే అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రీరాములు శరణ్ కుమార్ వీడియో తీస్తున్నాడు.
Hyderabad Police | రోలెక్స్ వాచ్‌పై కన్ను..
వీడియో తీస్తున్న శరణ్‌కుమార్ కన్ను అపార్ట్మెంట్లోని రోలెక్స్ వాచ్‌పై పడింది. మెల్లిగా దానిని జేబులో పెట్టుకున్నాడు. అయితే మరో కానిస్టేబుల్ తీసిన వీడియోలో ఆ దృశ్యం రికార్డు అయింది. దీంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై వార్తలు ప్రచురితం కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ శ్రీరాములు శరణ్ కుమార్ ఇంట్లో రోలెక్స్ వాచ్ (Rolex watch) సీజ్ చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
అయితే సదరు రోలెక్స్ వాచ్ అసలుది కాదని తెలిసింది. తప్పిపోయిన గడియారం నకిలీ రోలెక్స్‌గా గుర్తించారు. ఇమిటేడ్ కాపీ రోలెక్స్ వాచ్ కాజేసిన పోలీస్ కానిస్టేబుల్ చివరకు జైలు పాలయ్యాడు.
