Bandi Sanjay | ‘మార్వాడీ గో బ్యాక్’​ వెనుక కుట్ర.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | హిందూ సమాజాన్ని చీల్చేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ ఆరోపించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని యూసుఫ్‌గూడలో శుక్రవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు (Ramachandra Rao)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్వాడీ గో బ్యాక్​ నినాదం వెనుక కుట్ర ఉందన్నారు. కాగా సోషల్​ మీడియాలో ఇటీవల మార్వాడీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | హిందూ సమాజాన్ని చీల్చేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ ఆరోపించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని యూసుఫ్‌గూడలో శుక్రవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు (Ramachandra Rao)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్వాడీ గో బ్యాక్​ నినాదం వెనుక కుట్ర ఉందన్నారు. కాగా సోషల్​ మీడియాలో ఇటీవల మార్వాడీ గో బ్యాక్​ అంటూ ప్రచారం జరుగుతోంది. వారు తమ వ్యాపారులను దెబ్బ తీస్తున్నారని కొందరు గో బ్యాక్​ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు.

హిందూ సమాజం సంఘటితం అవుతుండటంతో కమ్యూనిస్ట్​ల ముసుగులో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, ఎంఐఎం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్లాన్​ ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్వాడీలు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారన్నారు. అధికారం కోసం, దోపిడీ కోసం రావడం లేదన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉందని బండి సంజయ్​ తెలిపారు. మన తెలంగాణ వారు సైతం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారని చెప్పారు.

Bandi Sanjay | రోహింగ్యాలపై మాట్లాడాలి

మార్వాడీలు గో బ్యాక్​ అంటూ ప్రచారం చేస్తున్న వారు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తాము రోహింగ్యా గో బ్యాక్‌ అంటూ ఆందోళనలు చేపడతామన్నారు. అనేక మంది రోహింగ్యా(Rohingya)లు వచ్చి హైదరాబాద్​లో ఉంటున్నారన్నారు. హైదరాబాద్​ ఐఎస్​ఐ అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలతో ప్రమాదం పొంచి ఉందని వారి గురించి మాట్లాడాలని డిమాండ్​ చేశారు.

Bandi Sanjay | ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ఎలా గెలిచింది

ఓటు చోరీ (Vote Chori) ఆరోపణలపై బండి సంజయ్​ స్పందించారు. తాము ఓట్ల చోరీ చేస్తే మాకు 240 సీట్లే వస్తాయా అని ప్రశ్నించారు. అలా అయితే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్​ ప్రదేశ్​లో కాంగ్రెస్​ ఎలా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ పరిస్థితి ఇలా తయారు అయిందని బండి సంజయ్​ ఎద్దేవా చేశారు.

Bandi Sanjay | కులవృత్తులను దెబ్బ తీస్తున్నారు

హిందువుల కుల వృత్తుల కొన్ని వర్గాల వారు దెబ్బ తీస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. హిందువుల పొట్ట కొడుతున్న వారి గురించి మాట్లాడాలని డిమాండ్​ చేశారు. హిందువుల కుల వృత్తులను కాపాడాలని తాము ఉద్యమం చేస్తామన్నారు. కాంగ్రెస్​ తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తుందన్నారు. బీహార్​లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...