అక్షరటుడే, బోధన్: Conocarpus plants| పట్టణంలోని ప్రధాన రోడ్ల వెంబడి డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని బీజేపీ పట్టణ కమిటీ (BJP Urban Committee) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు (Municipal Commissioner) వినతిపత్రం అందజేశారు. పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ మాట్లాడుతూ.. కోనోకార్పస్ మొక్కలతో వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, నాయకులు కొల్లిపాక బాల్ రాజ్, వాసు, తదితరులు పాల్గొన్నారు.
