Homeతాజావార్తలుIndigo Flights | కనెక్టివిటీ పునరుద్ధరించాం.. ఇండిగో కీలక ప్రకటన

Indigo Flights | కనెక్టివిటీ పునరుద్ధరించాం.. ఇండిగో కీలక ప్రకటన

ఇండిగో విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. తన నెట్‌వర్క్‌లో ఎక్కువ భాగాన్ని పునరుద్ధరించినట్లు తెలిపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo Flights | ఇండిగో విమానయాన సంస్థ (IndiGo airline) కీలక ప్రకటన చేసింది. ఆరు రోజులుగా ఇండిగో సంక్షోభంతో అనేక విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంతో ఆదివారం తన నెట్‌వర్క్‌లో ఎక్కువ భాగాన్ని పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 1,500 కి పైగా విమానాలను నడిపిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. 138 గమ్యస్థానాలలో 135 తిరిగి కనెక్ట్ చేశామని పేర్కొంది. శనివారం 700 విమానాలను నడిపిన సంస్థ ఆదివారం ఆ సంఖ్యను 1500కు పెంచింది. రాజకీయ విమర్శలు (political criticism), నియంత్రణ పరిశీలనల మధ్య ఈ పునరుద్ధరణ ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం ఈ గందరగోళాన్ని ఇండిగో నిర్వహణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వైఫల్యంగా అభివర్ణించారు. డీజీసీఏ పెద్ద ఎత్తున కార్యాచరణ లోపాలపై ఎయిర్‌లైన్స్ సీఈవో పీటర్ ఎల్బర్స్ (Airlines CEO Peter Elbers), అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్క్వెరాస్‌లకు షోకాజ్ నోటీసులు అందజేసింది. దీంతో ఇండిగో విమానాలను పునరుద్ధరిస్తోంది.

Indigo Flights | ప్రయాణికులకు క్షమాపణ

ఇండిగో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఇండిగో ఇంకా “చాలా దూరం వెళ్ళాలి” కానీ నమ్మకాన్ని పునర్నిర్మించడానికి కట్టుబడి ఉందని చెప్పింది. అంతరాయాల సమయంలో మద్దతు ఇచ్చినందుకు సిబ్బంది, కస్టమర్లు, భాగస్వాములు ప్రభుత్వ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇండిగో చర్యలతో ఎయిర్​పోర్టుల్లో కొంతమేర రద్దీ తగ్గింది. రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్​ ధరలను పూర్తిగా రీఫండ్​ చేస్తామని సంస్థ ప్రకటించింది.

Must Read
Related News