Caste Census | కుల గ‌ణ‌న‌ను స్వాగ‌తించిన కాంగ్రెస్‌.. తెలంగాణ మోడ‌ల్‌ను అనుస‌రించాల‌ని సూచ‌న‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:Caste Census | దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న నిర్వ‌హించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress Party) స్వాగతించింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కుల గ‌ణ‌న మోడ‌ల్‌ను అనుస‌రించాల‌ని కేంద్రానికి సూచించింది. జన గ‌ణ‌న‌తో పాటు పాటు కుల గణన(Caste Census)ను కూడా నిర్వహిస్తామని కేంద్రం బుధ‌వారం చేసిన ప్రకటనను స్వాగతిస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వాగ‌తించారు. అదే స‌మ‌యంలో కుల గ‌ణ‌నకు ఏయే విధానాలు అవ‌లంభిస్తారో చెప్పాల‌ని, అలాగే, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Caste Census | దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న నిర్వ‌హించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress Party) స్వాగతించింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కుల గ‌ణ‌న మోడ‌ల్‌ను అనుస‌రించాల‌ని కేంద్రానికి సూచించింది. జన గ‌ణ‌న‌తో పాటు పాటు కుల గణన(Caste Census)ను కూడా నిర్వహిస్తామని కేంద్రం బుధ‌వారం చేసిన ప్రకటనను స్వాగతిస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వాగ‌తించారు. అదే స‌మ‌యంలో కుల గ‌ణ‌నకు ఏయే విధానాలు అవ‌లంభిస్తారో చెప్పాల‌ని, అలాగే, నిర్దిష్ట కాల ప‌రిమితిలోగా ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని కోరారు.

Caste Census | తెలంగాణ మోడ‌ల్‌ను పరిశీలించండి..

కుల గణన నిర్వహించడం అనేది ఒక ప్రాథమిక దశ మాత్రమేనని, దాని నుండి వెలువడే వివరాలు తదుపరి అభివృద్ధి కార్యకలాపాలకు వెన్నెముకగా నిలుస్తాయని రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ(Telangana) కుల గణన నమూనాను కేంద్రం అధ్యయనం చేయాలని, ఆ దిశగా ఆ ఆలోచనను అమలు చేయాలని సూచించారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) చెప్పినట్లుగా నాలుగు విస్తృత కుల వర్గాలను గుర్తించే ఆలోచనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, కానీ జనాభా గణన ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై దానిపై స్పష్టత ఇవ్వాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.

Caste Census | సామాజిక న్యాయం కావాలి..

కుల గణన నిర్వహిస్తామని, 50% రిజర్వేషన్(Reservation) పరిమితిని తొలగిస్తామని తాము పార్లమెంటులో చెప్పామ‌ని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణ‌యానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ వంటి నమూనాలను ఉపయోగించి కుల గణనను రూపొందించడంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం(Government) ఒక నిర్దిష్ట కాల ప‌రిమితి గురించి చెప్పాల‌న్నారు. కేవలం కుల గణనను నిర్వహించి చేతులు దులుపుకుంటే స‌రిపోద‌ని, సామాజిక న్యాయం వైపు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్‌గాంధీ అన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...