HomeతెలంగాణBRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి...

BRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal​ జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్​ఎస్​ రజతోత్సవ సభతో కాంగ్రెస్​ ప్రభుత్వానికి వణుకు మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర నేత బాజిరెడ్డి జగన్​ brs leader bajireddy jagan పేర్కొన్నారు. సభ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు జరుగుతాయని, దీంతో ప్రభుత్వానికి భయం మొదలైందని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏడాదిన్నర కాలంలోపే కాంగ్రెస్​ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బాజిరెడ్డి జగన్ అన్నారు. తిరిగి కేసీఆర్​ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ brs president Kcr​ సభ అనగానే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్నారు. లక్షలాది మందితో సభ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా తరలిరాబోతున్నారని జగన్​ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ప్రత్యేకించి రైతుల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. రైతులను విస్మరించిన కాంగ్రెస్​ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన​ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీఆర్​ఎస్​ అధికారంలోకి రావడం ఖాయమని జగన్​ ధీమా వ్యక్తం చేశారు.