అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kanta Rao) కోరారు. మహమ్మద్ నగర్ మండల (Mohammed Nagar mandal) కేంద్రంతో పాటు దూప్‌సింగ్ తండా, గిర్ని తండా, గాలిపూర్, మొగ్ధుంపూర్, కోమలంచ, తుంకిపల్లి గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Panchayat Elections | మాజీ ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టలేదు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్‌షిండే నియోజకవర్గ అభివృద్ధిపై కనీస శ్రద్ధ చూపించలేదని, గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కూడా అందించలేకపోయారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల (welfare schemes) గురించి ప్రజలకు వివరించారు.
Panchayat Elections | గ్రామాల అభివృద్ధి కోసం..
గ్రామాల్లో అభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకు గ్రామాలకు మధ్య సర్పంచ్‌లు వారధిగా నిలబడాలని సూచించారు. సమన్వయంతోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని స్పష్టం చేశారు. ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.