అక్షర టుడే, ఎల్లారెడ్డి : MLA Thota Laxmi Kantha Rao | కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మద్నూర్ మండల (Madnur Mandal) కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుదారుడు, సర్పంచ్ అభ్యర్థి ఉష సంతోష్ మేస్త్రి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పంచాయతీ కార్యాలయానికి (Panchayat Office) ర్యాలీగా చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉష సంతోష్ మేస్త్రిని గెలిపిస్తే మద్నూర్ను ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాడని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువు కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) తదితరులు పాల్గొన్నారు.
