Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan Rao | కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​

MLA Madan Mohan Rao | కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచ్​లుగా గెలిపించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో గురువారం ఆయన సమీక్షించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan Rao | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచ్​లుగా గెలిపించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ కోరారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో గురువారం ఆయన సమీక్షించారు. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులకు క్యాంప్​ కార్యాలయంలో శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ప్రజలందరూ కాంగ్రెస్ (Congress) మద్దతుదారులను ఆశీర్వదిస్తే భవిష్యత్​లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని వెల్లడించారు. అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కసరత్తు చేయాలని సూచించారు.

రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావహులు ఎవరు కూడా నిరాశపడవద్దని.. రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పార్టీ మద్దతుదారులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మదన్​మోహన్ హెచ్చరించారు.

Must Read
Related News