అక్షరటుడే, ఆర్మూర్: BC Reservations Congress | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ (Eeravatri Anil) అన్నారు. ఆర్మూర్ బల్దియా ఛైర్పర్సన్ లహరి, వైస్ ఛైర్మన్ కాట్పల్లి వెంకట రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.
BC Reservations Congress | బీసీ మహిళలకు బల్దియా పీఠాలు..
ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ.. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గల్లలో బీసీ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 42శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తే కేంద్రంలో మోకాలడ్డు పెడుతోందన్నారు. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయట్లేదని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష పార్టీల్లోనే వ్యక్తులే కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 64శాతం వరకు బీసీలకు బల్దియా పీఠాలను అప్పజెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఆర్మూర్ ప్రజలు ఇతర పార్టీలను తిరస్కరించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Former MLA Jeevan Reddy) మతిభ్రమించి ఆర్మూర్‌లో తిరుగుతున్నాడని, జీవన్ రెడ్డిని ఆస్పత్రిలో చూపించాలన్నారు.
టీపీపీసీ అధికార ప్రతినిధి ఏబీ చిన్నా మాట్లాడుతూ..ఎంపీ అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్‌కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీ పద్మశాలి బిడ్డను ఆర్మూర్ ఛైర్‌పర్సన్‌గా చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ప్రీతికరమైన నియోజకవర్గం ఆర్మూర్ అన్నారు. ఆర్మూర్ నుంచి పాదయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి సీఎం వరకు ఎదిగారన్నారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వారి నిధులనుంచి మున్సిపల్ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజవర్గంపై ప్రత్యేక దృష్టి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy), మున్సిపల్ ఛైర్పర్సన్ గోనె లహరి, వైస్ ఛైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
