అక్షరటుడే, కామారెడ్డి: Gampa Govardhan | ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) అన్నారు. యూత్ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని 19, 22 వార్డులకు చెందిన 30మంది యువకులు గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడిస్తేనే పథకాలు అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) వచ్చి రెండేళ్లయిందని, ఎన్నికల ముందు గ్యారెంటీ కార్డులు పంచి బాండ్ పేపర్ రాసిచ్చారని, ఇప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు హన్మాండ్లు, పట్టణ యూత్ ఉపాధ్యక్షులు చంద్రకాంత్, కోశాధికారి సాయి, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Gampa Govardhan | ఇస్రోజీవాడి కాంగ్రెస్ కార్యకర్తలు
కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి (Isrojiwadi village) చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన చెట్కూరి ప్రవీణ్, చిందం మల్లేష్, చిందం రవి, బుల్లె మధు, ఎండి సమీర్ లు బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.