అక్షరటుడే, భీమ్‌గల్: Muthyala Sunil Reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి (Muthyala Sunil Reddy) అన్నారు. మండలంలోని ఎంజీ తండాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు ఆదివారం బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ (Congress party) బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ భారీ చేరికలతో ఎంజీ తండాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Muthyala Sunil Reddy | సర్పంచ్ నేతృత్వంలో..
ఎంజీ తండా సర్పంచ్ దేగావత్ అమీనా, ఉప సర్పంచ్ దేగావత్ గణేష్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కేతావత్ హుస్సేన్, లింబాద్రి, లలిత, లక్ష్మి, లత, మలావత్ రాజు, దిగావత్ గంగు తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఎంజీ తండా వీడీసీ (VDC) పెద్దలు, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ వల్లి, పరమేష్, మోహన్, వినోద్, మోతీలాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.