అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Laxmi Kantha Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (Mla Laxmi Kantha Rao) పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని (Yellareddy town) గురు ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల అభ్యున్నతి కోసమే పాటుపడుతుందన్నారు.
Mla Laxmi Kantha Rao | పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత
పార్టీలో కష్టపడే వారికే ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. కార్యకర్తలు అంతా బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటినట్లుగానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పనిచేయాలని బిచ్కుంద మున్సిపాలిటీ (Bichkunda municipality) కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని అన్నారు.
Mla Laxmi Kantha Rao | ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
బిచ్కుంద మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల పరిధిలోని గ్రామాల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.