Nizamabad Collector
Nizamabad Collector | కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Collector | నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (State Cooperative Union Limited) ఛైర్మన్​ మానాల మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. వారి వెంట ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శేఖర్, సిరికొండ మండల అధ్యక్షుడు రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కౌశిక్‌ ఉన్నారు.