అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal | భీమ్‌గల్ పట్టణాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) ప్రకటించారు. పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్‌గల్ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.54 కోట్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో భీమ్‌గల్ మున్సిపాలిటీ (Bhimgal Municipality) అభివృద్ధికి నోచుకోక అన్యాయానికి గురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) ఆ లోటును పూడుస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Bheemgal | భారీగా కాంగ్రెస్ గూటికి కార్యకర్తలు..
ఈ సందర్భంగా.. ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్‌గల్ పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరారు. చేరిన వారిలో పర్శ సుధాకర్, మారి పెద్దిలింగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తోందని సునీల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భీమ్‌గల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మల్లెల లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, నల్లూరి శ్రీనివాస్, సతీష్, దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
