MP Arvind | నగరంలో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు : ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | ఏ ఎన్నికలు వచ్చినా నిజామాబాద్​ (Nizamabad)జిల్లాలో బీజేపీ (BJP) గెలుస్తుందని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల చివరి వారంలో ఇందూరుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ స్థాయి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రెండే పార్టీలు గెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | ఏ ఎన్నికలు వచ్చినా నిజామాబాద్​ (Nizamabad)జిల్లాలో బీజేపీ (BJP) గెలుస్తుందని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల చివరి వారంలో ఇందూరుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ స్థాయి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రెండే పార్టీలు గెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందన్నారు. నగరంలో కాంగ్రెస్​కు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని ఆయన అన్నారు. టికెట్​ రాని వారు ఎవరైనా తప్పేదారి బీజేపీ నుంచి వెళ్తే వారే ఆ పార్టీకి దిక్కు అవుతారని వ్యాఖ్యానించారు.

MP Arvind | ఆ పార్టీలోకి వెళ్తే ఆత్మహత్య చేసుకున్నట్లే..

నగరంలో కొందరు నాయకులు బీజేపీ నుంచి టికెట్​ రాకపోతే కాంగ్రెస్​ (congress)లోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు. ఆ పార్టీలోకి వెళ్తే ఆత్మహత్య చేసుకున్నట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పని చేసేవారికి టికెట్​ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తాను సర్వే చేసినట్లు తెలిపారు. బీజేపీ టికెట్​ వస్తే పోటీ చేయాలని, రాకపోతే వచ్చిన వారిని గెలిపించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో భవిష్యత్​ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడ్డ వారికి తర్వాత ఇతర చోట్ల అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నిజామాబాద్​లో జిల్లా పరిషత్​ ఛైర్మన్​, మున్సిపల్​ ఛైర్మన్​ పదవులను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుందన్నారు. ప్రజలు బీజేపీకి తప్పా ఇతర పార్టీలకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...