అక్షరటుడే, గాంధారి: Mla madan Mohan | విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Mla madan Mohan Rao) పేర్కొన్నారు. గాంధారి మండల (Gandhari Mandal) కేంద్రంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
Mla madan Mohan | ఇందిరమ్మ మోడల్ హౌస్..
గాంధారి మండల కేంద్రంలో ముందుగా ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు (Indiramma Model House) ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్మించిన కొత్త మరుగుదొడ్లను ప్రారంభించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సొంత నిధులు రూ.9 లక్షలు కేటాయించారు. అంతేకాకుండా అదే పాఠశాలలో ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ ల్యాబ్, కొత్త కంప్యూటర్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించారు.
ఈ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు సాంకేతిక విద్యలో మరింత అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. తర్వాత రూ.12లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
1 comment
[…] ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) పేర్కొన్నారు. సదాశివనగర్ మండల […]
Comments are closed.