అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Madhusudanachari | కక్ష సాధింపులో భాగంగానే హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అంటే స్కీమ్‌ల ప్రభుత్వం అని, కాంగ్రెస్ అంటే స్కాంల ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని బీఆర్ఎస్ నిలదీస్తుండటంతో కేసులు పెడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావుకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజం అంత కదిలి వచ్చిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అవినీతిపై హరీష్ రావు ప్రశ్నిస్తూనే ఉంటారని పేర్కొన్నారు.
MLC Madhusudanachari | అందుకే నోటీసులు
సింగరేణి బొగ్గు గనుల కాంటాక్ట్ బయటపెట్టినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజా క్షేత్రంలో బయట పెడుతుండటంతో తమ నేతలపై కార్ రేస్ అని, విద్యుత్ కేసు అని విచారణ పేరుతో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) హామీలను నిలదీస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకుడన్నారు.