అక్షరటుడే, ఆర్మూర్: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) నెరవేరుస్తోందని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలూర్ మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) లబ్ధిదారుడి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి లబ్ధిదారుడికి వస్త్రాలు అందజేశారు.
Indiramma Housing Scheme | ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం..
ఈ సందర్భంగా వినయ్ రెడ్డి (Vinay Reddy) మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు పేదల జీవితాల్లో స్థిరత్వం తీసుకువస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత మేలు చేసే దిశగా కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర విజయ్, ఉప సర్పంచ్ మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, ముత్యం రెడ్డి, ఉదయ్, నవనీత్, మహేష్, కిషన్, నిలగిరి శ్రీనివాస్, మహేష్, శశి, తదితరులు పాల్గొన్నారు.
