అక్షరటుడే, ఎల్లారెడ్డి : Hanmant Shinde | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Hanmant Shinde) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో నిజాంసాగర్‌లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లడారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తామని చెప్పి కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చిందన్నారు. బీసీలంతా కాంగ్రెస్ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం అచ్చంపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి హన్మంత్ షిండే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట నాయకులు దుర్గారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు న్నారు.