అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipality | పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని 12వ వార్డులో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Yellareddy Municipality | పట్టణంలోని 12 వార్డులో..
ఈ సందర్భంగా 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎరకల దశరథంకు మద్దతుగా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
గత రెండేళ్లలో ఆధునిక సౌకర్యాలతో కొత్త బస్‌స్టాండ్ నిర్మాణం, మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, అమృత్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..
అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జాతీయ రహదారి అభివృద్ధి, గాంధీ చౌక్–అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి, అర్బన్ పార్క్, ఐటీఐ విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వంటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ‘మాటలకంటే చేసిన అభివృద్ధే నా బలం. ప్రజల సహకారంతో ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను’ అని ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
3 comments
[…] ఉమ్మడి నిజామాబాద్ జిల్లా… Yellareddy Municipality | కాంగ్రెస్ అభ్యర్థులను భారీ… Shamantha Narender Reddy | కాంగ్రెస్ గెలుపు ఖాయం :… […]
[…] ఉమ్మడి నిజామాబాద్ జిల్లా… Yellareddy Municipality | కాంగ్రెస్ అభ్యర్థులను భారీ… Shamantha Narender Reddy | కాంగ్రెస్ గెలుపు ఖాయం :… […]
[…] మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని ఎన్నికల నిర్వహణ కోసం 24 […]
Comments are closed.