అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shamantha Narender Reddy | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ 19వ డివిజన్ అభ్యర్థిని కాట్పల్లి శమంత నరేందర్ రెడ్డి (Shamantha Narender Reddy) అన్నారు. డివిజన్లో ఆమె గురువారం ప్రచారం చేశారు.
నగరంలోని మారుతి నగర్ కాలనీలో శమంత నరేందర్‌రెడ్డి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌తోనే నగర అభివృద్ధి సాధ్యమన్నారు. మారుతి నగర్ కాలనీలోని సమస్యలు తనకు తెలుసన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. 19వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై (Nizamabad Municipal Corporation) కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని శమంత నరేందర్‌రెడ్డి అన్నారు. మెజారిటీ డివిజన్లలో గెలుపొంది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే నగరానికి భారీగా నిధులు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. మహిళ సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

