అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందర్భంగా పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో దేవునిపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు.
MLA Madan Mohan | నాల్గో వార్డు పరిధిలోని..
పట్టణంలోని నాల్గో వార్డు పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి (Devunipalli Village) చెందిన నీల సిద్ధిరాములు సుమారు 100మందితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ (Yellareddy Constituency) అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్మోహన్ చేస్తున్న నిరంతర కృషి, ప్రజా సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలే తమను ఆకర్షించాయని కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.
MLA Madan Mohan | ప్రజా సమస్యల పరిష్కారం కోసం..
ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే కాంగ్రెస్ పార్టీతో కలిసి అభివృద్ధి పథంలో నడవాలనే లక్ష్యంతో పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, నాల్గో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంజుల శంకర్, నాగం గోపి, నీల రవి, గోవింద్ నాయక్, శ్రీనివాస్‌తో పాటు మండల నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
3 comments
[…] ముగిసే వరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) ఒంటిచేత్తో పార్టీని నడిపించారు. […]
[…] వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) జనగామ దగ్గరలోని ఓ రిసార్ట్‌కు […]
[…] మదన్ మోహన్ (MLA Madan Mohan) మున్సిల్ ఎన్నికలను […]
Comments are closed.