అక్షరటుడే నిజామాబాద్ సిటీ : DCC Nizamabad | కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు పార్టీ ఆఫీస్లో దరఖాస్తు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో (Congress Party Office) సోమవారం మీడియాతో మాట్లాడారు.
DCC Nizamabad | ఫిబ్రవరిలో ఎన్నికలు..
సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని సుమారు 116 మున్సిపాలిటీలకు, ఏడు నగర కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) మూడు మున్సిపాలిటీలు ఒక నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి బోధన్ మున్సిపాలిటీకి జనరల్, నిజామాబాద్ మున్సిపాలిటీకి మహిళా జనరల్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు మహిళా జనరల్ రావడం జరిగిందన్నారు.
DCC Nizamabad | రిజర్వేషన్లు ఖరారు..
బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు, నిజామాబాద్లో 60 డివిజన్లు, ఆర్మూర్లో 36 వార్డులు, భీమ్గల్లో 12 వార్డులు ఉన్నాయని నగేష్రెడ్డి తెలిపారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా ఆశావహులు టికెట్ల కోసం తమ పట్టణాల అధ్యక్షులకు దరఖాస్తులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే నిజామాబాద్, భీమ్గల్, ఆర్మూర్ పట్టణాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 70 శాతం సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే నిజామాబాద్లో 545 స్థానాలలో 360 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నామని చెప్పారు.
DCC Nizamabad | హామీలను నెరవేరుస్తున్నాం..
ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తున్నాం కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచారని డీసీసీ అధ్యక్షుడు అన్నారు. ఇప్పటికే 80 శాతం వాగ్దానాలు నెరవేర్చడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరుగుతుందని, పేద ప్రజల కోసం రేషన్ కార్డులు (Ration Cards) మంజూరు చేస్తున్నామన్నారు.
DCC Nizamabad | గత పాలకుల కారణంగా రాష్ట్రం అప్పులపాలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని నగేష్ రెడ్డి విమర్శించారు. రూ.14వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆదాయం అప్పులకు వడ్డీలకు సరిపోవడం లేదని నగేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గానికి పేద ప్రజలకు 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా ఛైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజారెడ్డి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రం, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ ఘన్రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి , బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగం, జిల్లా ఫిషరీస్ ఛైర్మన్ శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి వేణు రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.