అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాలకు ఆదివారం నగరంలోని మాణిక్ భవన్(Manik Bhavan) పాఠశాలలో ఎన్నికలు జరిగాయి. కాగా సాయంత్రం 6 గంటలకు కేంద్రం గేట్లను మూసివేశారు. క్యూలైన్లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా.. ఎన్నికల జరుగుతున్న క్రమంలో గందగోళం ఏర్పడింది. క్రాస్ ఓటింగ్ జరుగుతోందంటూ కొందరు ఆరోపణలు చేశారు. ఎన్నికల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు.
Arya Vaishya Sangham | ఎన్నికల ఇన్ఛార్జికి ఫిర్యాదులు..
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కేంద్రం లోపల ఉన్నారని.. పరిచయస్తులను తమ ప్యానల్‌కు అనుకూలంగా దగ్గరుండి ఓటేయిస్తున్నారని కొందరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ మేరకు నినాదాలు చేశారు. ఓటింగ్ ప్రక్రియ సరైన పద్ధతిలో జరగడం లేదంటూ ఎన్నికల ఇన్‌ఛార్జి బాలదాసుకు ఫిర్యాదులు కూడా చేశారు.
Arya Vaishya Sangham | సజావుగా జరగాలి: ఎమ్మెల్యే
వైశ్య సంఘం ఎన్నికల్లో క్రాస్ ఓట్లు పడుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు నినాదాలు చేశారు. ఓ మహిళ వద్ద బ్యాలెట్ బుక్కులు లభించడంతో వాటిని ఎన్నికల ఇన్ఛార్జీలకు అందజేశారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ప్రధానంగా కేంద్రంలోపల పోటీ చేసే అభ్యర్థులు ఉండడం సమంజసం కాదని సూచించారు. అలాగే ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఎన్నికల కేంద్రానికి చేరుకొని బందోబస్తును పర్యవేక్షించారు. కాగా.. ఓట్ల లెక్కింపు సోమవారం గంజ్‌లో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనంలో జరగనుంది.
