Homeజిల్లాలునిజామాబాద్​Limbadri gutta | లింబాద్రిగుట్ట అర్చకులపై ఫిర్యాదు

Limbadri gutta | లింబాద్రిగుట్ట అర్చకులపై ఫిర్యాదు

లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల్లో దురుసుగా ప్రవర్తించిన అర్చకులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్​ యూనియన్​ నాయకులు కోరారు. ఈ మేరకు భీమ్​గల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్ : Limbadri gutta | భీమ్​గల్ లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల్లో (Limbadrigutta Brahmotsavam) భాగంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులు, విలేకరులతో పాటు భక్తులపై దురుసుగా ప్రవర్తించిన అర్చకులపై భీమ్​గల్ జర్నలిస్ట్ యూనియన్ (Bheemgal Journalists Union) ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్రహ్మోత్సవాల (Jatara Brahmotsavam) వార్తలను సేకరించడానికి వెళ్లిన విలేకరులతో నంబి వంశస్థులతో పాటు ఇతర అర్చకులు దురుసుగా ప్రవర్తించారని, అసభ్యకరంగా మాట్లాడి అవమానించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రథ భ్రమణం సందర్భంగా తాడును లాగుతున్న భక్తులపై పిడి గుద్దులు కురిపించారన్నారు. అన్నసత్రంలో సేవ పేరిట కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, భక్తులను తిట్టడం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్వామి కల్యాణం (Swami Kalyanam) రోజు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, మీడియా వారు అన్న ప్రసాదం కోసం వెళ్తే దురుసుగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా, ప్రజలు, భక్తులతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్న అర్చకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. తమకు అందిన ఫిర్యాదు మేరకు లింబాద్రిగుట్ట అర్చకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.