46
అక్షరటుడే, హైదరాబాద్: Compassionate Appointments | కుటుంబాన్ని పోషించే ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే.. వారి కుటుంబం, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆదాయం కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యుల్లో అర్హతలను బట్టి ఎవరైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా జీవనాధారం కల్పించడమే కారుణ్య నియామకాల ప్రధాన ఉద్దేశం.
Compassionate Appointments | సామాజిక భద్రత
ఉద్యోగుల పట్ల బాధ్యతగా, వారి కుటుంబాలు దిక్కులేని పరిస్థితిలో ఉండిపోకుండా సామాజిక భద్రత కల్పించే ఆలోచనతో ప్రభుత్వం ఈ కారుణ్య నియామకాల విధానం తీసుకొచ్చింది. ఇది మెరిట్, ప్రతిభ ఆధారంగా చేపట్టే నియామకం కాదు. కేవలం మానవతా దృక్ఫథంతో తీసుకునే నిర్ణయం. కారుణ్య నియామకాలు హక్కు కాదు.. ఇది ఒక సడలింపు (concession)గా పేర్కొంటున్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
కారుణ్య నియామకాల జీవోలు:
- G.O.Ms.No. 687, G.A. (Ser.A) Dept, Dated 03-10-1977: కారుణ్య నియామకాల పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రాథమిక జీవో.
- G.O.Ms.No. 165, G.A. (Ser.A) Dept, Dated 20-03-1989: అర్హతలు లేని పక్షంలో నియామకం పొందిన తర్వాత అర్హత సాధించడానికి ఇచ్చే సమయం గురించి ఇందులో ఉంటుంది.
- G.O.Ms.No. 969, G.A. (Ser.A) Dept, Dated 27-10-1995: ఒకవేళ అభ్యర్థికి నిర్ణీత విద్యా అర్హత (ఉదాహరణకు Intermediate / Degree) లేకపోతే, వారికి ఆ అర్హత సాధించడానికి గ్రేస్ పీరియడ్ (Grace Period) ఇవ్వడం గురించి ఇందులో వివరించారు.
- G.O.Ms.No. 60, Education Dept, Dated 11-02-1997: టైప్ రైటింగ్, ఇతర విద్యా అర్హతల నిబంధనలపై స్పష్టతనిస్తుంది.
- G.O.Ms.No. 112, Higher Education Dept, Dated 27-10-2001: డిప్లొమా హోల్డర్లను ఇంటర్మీడియట్‌తో సమానంగా పరిగణించడం గురించి తెలుపుతుంది.