HomeజాతీయంMumbai | మహిళను గన్​తో బెదిరించి.. నగ్నంగా ఫొటోలు తీసిన ఓ కంపెనీ ఎండీ

Mumbai | మహిళను గన్​తో బెదిరించి.. నగ్నంగా ఫొటోలు తీసిన ఓ కంపెనీ ఎండీ

మహిళను సమావేశానికి ఆహ్వానించి ఫార్మా కంపెనీ ఎండీ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mumbai | మహారాష్ట్ర (Maharashtra)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సమావేశానికి ఆహ్వానించి ఓ మహిళతో ప్రైవేట్​ కంపెనీ ఎండీ (Private Company MD) అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేగాకుండా ఆమెను గన్​తో బెదిరించి నగ్నంగా ఫొటోలు తీశాడు.

బాధితురాలి కథనం ప్రకారం.. ముంబైలోని ఫొటో ఫ్రేమ్, గిఫ్ట్ వ్యాపారం నిర్వహిస్తున్న 51 ఏళ్ల మహిళను ఫ్రాంకో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, వ్యవస్థాపక సభ్యుడు జాయ్ జాన్ పాస్కల్ సమావేశం కోసం ఆహ్వానించాడు. మీటింగ్​కు వెళ్లిన తర్వాత ఆయన ఆమె భుజంపై రివాల్వర్​తో దాడి చేశారు. బలవంతంగా MD క్యాబిన్‌లోకి తీసుకెళ్లి, తుపాకీ (Gun)తో గురిపెట్టి బట్టలు విప్పి లైంగికంగా వేధించాడు. నగ్నంగా ఉన్న ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు. విషయం బయట ఎవరికైనా చెబితే ఈ ఫొటోలు బయటపెడతామని బెదిరించారు. ఈ ఘటన చాలా రోజుల క్రితం చోటు చేసుకోగా.. బాధితురాలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Mumbai | కేసు నమోదు

పాస్కల్, మరో ఐదుగురు తనను బలవంతంగా తుపాకీతో బెదిరించి నగ్నంగా చేసి, శారీరకంగా వేధించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చారు. లైంగిక వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపుల ఆరోపణలపై వారిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా నిందితులు బాధితురాలి ఆరోపణలను ఖండించారు. కల్పిత కథలుగా కొట్టిపారేశారు.

Must Read
Related News