అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Global Summit | రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆహ్వానించాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయింది. వివిధ దేశాల ప్రతినిధులు, కంపెనీలు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. రెండో రోజు సదస్సుల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఇందులో భాగంగా 27 అంశాలపై చర్చలు జరిగాయి. అనేక కంపెనీలు తెలంగాణతో (Telangana) పాటు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఎంవోయూ కుదుర్చుకున్నాయి. సోమవారం పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా.. మంగళవారం మరికొన్ని కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తెలంగాణలో రూ. 150 కోట్ల పెట్టుబడితో పాల వ్యాపారాన్ని (రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం) విస్తరించే ప్రతిపాదనపై అవగాహన ఒప్పందం కూదుర్చుకుంది. దీనికి 40 ఎకరాల భూమి అవసరం మరియు 2 సంవత్సరాలలో 300 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలి.
Global Summit | ఆహార పరిశ్రమలు
ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అత్యాధునిక ఆహారం, వ్యవసాయ పరిశోధన అభివృద్ధి కేంద్రం, గ్రీన్‌ఫీల్డ్ అరుదైన చక్కెరల తయారీ సౌకర్యం అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై అవగాహన ఒప్పందం చేసుకుంది. మొత్తం రూ. 2,000 కోట్లు (ఫేజ్ 1లో రూ. 500 కోట్లు, ఫేజ్ 2లో రూ. 1,500 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు వంద ఎకరాల భూమి కావాల్సి ఉండగా.. రెండేళ్లలో 800కు పైగా ఉద్యోగులను తీసుకుంటుంది. తెలంగాణలో స్థిరమైన వ్యవసాయం కోసం స్పెషాలిటీ క్రాప్ న్యూట్రిషన్, బయో-స్టిమ్యులెంట్లు, బయోలాజికల్స్ కోసం రూ. 200 కోట్లతో ఒక ప్రాజెక్టును కూడా ప్రతిపాదిస్తోంది. పెద్ద ఎత్తున ఆహారం, పానీయాల తయారీ (యూనిట్-2) ద్వారా 44 ఎకరాల భూమిలో రూ. 650 కోట్ల పెట్టుబడితో తెలంగాణ కార్యకలాపాలను విస్తరించేందుకు కేజేఎస్ ఇండియా (KJS India) ఒప్పందం చేసుకుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పానీయాలు, స్నాక్స్, మిఠాయి వినియోగదారు ఉత్పత్తుల కోసం 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీని ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.
Global Summit | ఎనర్జీ రంగంలో..
రాష్ట్ర ప్రభుత్వం క్లీన్, గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. ఈ మేరకు పలు కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (JCK Infra Projects Limited) రూ.9 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఆర్సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 దశల్లో 2,500 కోట్ల పెట్టుబడి పెట్టి, 1600 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొంది. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ ఆధారిత 50 MW డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఏజీపీ గ్రూప్ 125 ఎకరాల్లో ఒక గిగా వాట్హైపర్స్కేల్ DC క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుంది. దీనికి మద్దతుగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను (Battery Energy Storage System) రూ.6,750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది.
Global Summit | రూ.70 వేల కోట్లు..
ఇన్‌ఫ్రాకీ డీసీ పార్కులు పెద్ద ఎత్తున డేటా పార్క్ అభివృద్ధి చేయనుంది. 150 ఎకరాల డేటాసెంటర్, మౌలిక సదుపాయాల కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పర్వ్యూ గ్రూప్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను (GCC) ఆల్-డ్రైవెన్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చింది. హెటెరో గ్రూప్ రూ.1800 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. అయితే వంద ఎకరాల భూమి అవసరం అని ప్రతిపాదించింది.