Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​ (PC Gosh) గురువారం తన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జాకు ఆయన నివేదిక అందించారు. కాళేశ్వరం (Kaleshwaram ) నిర్మాణంలో అక్రమాలు, ప్రాజెక్ట్​ డిజైనింగ్​లో మార్పులు, అనుమతులు లేకుండానే నిధుల విడుదల వంటి అంశాలపై కమిషన్​ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ నివేదికను అధికారులు శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​ (PC Gosh) గురువారం తన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జాకు ఆయన నివేదిక అందించారు. కాళేశ్వరం (Kaleshwaram ) నిర్మాణంలో అక్రమాలు, ప్రాజెక్ట్​ డిజైనింగ్​లో మార్పులు, అనుమతులు లేకుండానే నిధుల విడుదల వంటి అంశాలపై కమిషన్​ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ నివేదికను అధికారులు శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి అందించారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నివేదికను సీఎంకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Kaleshwaram Commission | ఉన్నత స్థాయి కమిటీ..

కాళేశ్వరం కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ (High-level committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేయనుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ నెల 4న కమిటీ కమిషన్​ నివేదిక సారాంశాన్ని మంత్రిమండలికి సమర్పించనుంది.

Kaleshwaram Commission | మంత్రివర్గంలో చర్చ

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు కమిషన్​ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయని కమిషన్​ పేర్కొన్నట్లు సమాచారం. దీనికి పలువురు కారణమని నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నివేదికపై మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో చర్చించనున్నారు. అనంతరం దీనిని అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...