అక్షరటుడే, ఇందూరు : SR College | దసరా సెలవులు(Dussehra Holidays) ఉన్నందున ఇంటర్ కళాశాల విద్యార్థులకు త్వరగా పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్(Navate Pratap) డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సార్ విద్యాసంస్థల జోనల్ ఇన్‌ఛార్జి శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దసరాకు ముందుగా నిర్వహించే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) మహిళలకు ప్రత్యేకమైందన్నారు. ఈ సందర్భంగా 27వ తేదీలోపున పరీక్షలన్నీ ముగించేలా చూడాలని కోరారు. 28వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దసరా సెలవులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సంఘం మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు గోదావరి, జిల్లా నాయకులు గణేష్ యాదవ్, శేఖర్, శ్రీను, పరమేష్, వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.