అక్షరటుడే, బోధన్: Panchayat Elections | గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నవీపేట్ మండలం అభంగపట్నం, ఎడపల్లి మండలం జానకంపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తనిఖీ చేశారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య, సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Panchayat Elections | పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తొద్దు..
ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలకు (Sarpanch and Ward posts) మినహాయించి, మిగిలిన స్థానాలకు మాత్రమే ఎన్నిక జరపాలని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లలో (polling station) మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
Panchayat Elections | ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించాలి
పోలింగ్ ముగిసిన తర్వాత జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించాలని సూచించారు. కోరంను సరిచూసుకుని ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఎన్నికల నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జానకంపేటలో (Janakampet) సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్న ప్రక్రియను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో కూడా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, ఓటర్లకు వారి ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందనే వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Panchayat Elections | రేషన్ షాపు ఆకస్మిక తనిఖీ
అనంతరం కలెక్టర్ ఎడపల్లి మండలం (Yedapally Mandal) నెహ్రూ నగర్‌లోని రేషన్ దుకాణాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం సజావుగా పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాల్లోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది. ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని రేషన్ డీలర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
