Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

Collector Nizamabad | నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) గురువారం మోస్రా, చందూర్, రుద్రూర్ మండల (Rudrur mandal) కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.

అందుబాటులో ఉన్న సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ.. సరిపడా స్టాఫ్ ఉన్నారా అని ఆరా తీశారు. నోటీస్ బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ (nomination process) సజావుగా నిర్వహించాలని, దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.

దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్​లను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డ్​లపై ప్రదర్శించాలన్నారు. జిల్లాకేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని ఆర్వోలకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) సంబంధిత అధికారులు ఉన్నారు.