Collector Praveenya | సింప్లిసిటీకి నిదర్శనం.. బాలికలతో నేలపై భోజనం చేసిన కలెక్టర్​ ప్రావీణ్య

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collector Praveenya : సంగారెడ్డి (Sangareddy collector) కలెక్టర్ ప్రావీణ్య తాజాగా జహీరాబాద్​ మండలంలో (Zaheerabad mandal) పర్యటించారు. హోతిలోని కస్తూర్బా బాలికల పాఠశాలను (Kasturba Girls School) (KGBV) సందర్శించారు. వంటగది, ఆహార నాణ్యత, స్టోర్ రూమ్​ను పరిశీలించారు. వీటితో పాటు తరగతి గదిలో కూర్చుని బోధనా విధానాన్ని పర్యవేక్షించారు. అనంతరం బాలికలతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. Collector Praveenya : గతంలో.. 2016 ఐఏఎస్​ బ్యాచ్​కు చెందిన […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collector Praveenya : సంగారెడ్డి (Sangareddy collector) కలెక్టర్ ప్రావీణ్య తాజాగా జహీరాబాద్​ మండలంలో (Zaheerabad mandal) పర్యటించారు. హోతిలోని కస్తూర్బా బాలికల పాఠశాలను (Kasturba Girls School) (KGBV) సందర్శించారు. వంటగది, ఆహార నాణ్యత, స్టోర్ రూమ్​ను పరిశీలించారు. వీటితో పాటు తరగతి గదిలో కూర్చుని బోధనా విధానాన్ని పర్యవేక్షించారు. అనంతరం బాలికలతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు.

Collector Praveenya : గతంలో..

2016 ఐఏఎస్​ బ్యాచ్​కు చెందిన ప్రావీణ్య​ సింప్లిసిటీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ఈమె గత నెల(జూన్ 13న​) సంగారెడ్డి కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు హనుమకొండ​ కలెక్టర్​గా విధులు నిర్వర్తించారు. కాగా, ప్రావీణ్య తాజాగా బాలికలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన ఫొటో నెట్టింట వైరల్​ అవుతోంది. ఆమె సింప్లిసిటీని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

ఒక జిల్లా పాలనాధికారి సాధారణ మహిళగా వ్యవహరించడంపై నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆమె పాలసీని అభినందిస్తున్నారు. కలెక్టర్​ ప్రావీణ్య పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల.. వారిలో మనోధైర్యం, ప్రేరణ కలిగిస్తాయని పేర్కొంటున్నారు. ఆమె వినయం, నిబద్ధతకు సెల్యూట్​ కొడుతున్నారు.

నెట్టింట వైరల్​ అవుతున్న ఫొటోను పరిశీలిస్తే.. అందులో కలెక్టర్​ ప్రావీణ్య తన పక్కన కూర్చున్న బాలికతో ముచ్చటిస్తున్నట్లు ఉంది. ఒక కలెక్టర్​ పక్కనే కూర్చుని, భోజనం చేస్తూ.. ముచ్చటిస్తుండటం అబ్బురంగా ఉందంటున్నారు పలువురు.

సాధారణంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (Kasturba Ganghi balikala Vidyalayam) నిరుపేద, నా అంటూ ఎవరూ లేని అభాగ్య బాలికలు చదువుతుంటారు. ఇలాంటి వారు నిరాదరణకు గురవుతుంటారు. అలాంటి వారితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య భోజనం చేయడం వల్ల.. వారిలో ఆత్మన్యూనతా భావం పోయి, ప్రేరణ కలుగుతుందని చెబుతున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...