అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | గ్రామ పంచాయతీ ఎన్నికలను (Gram Panchayat elections) పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) మంగళవారం సందర్శించారు.
ఎన్నికల సందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కంట్రోల్ రూంను సందర్శించి ఎన్నికలతో ముడిపడిన అంశాలకు సంబంధించి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, సూచనలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎంసీఎంసీ కమిటీ మెంబర్ సెక్రెటరీ ఎన్.పద్మశ్రీ తదితరులున్నారు.
