అక్షరటుడే, బోధన్: Fertilizers | ఎడపల్లి (Ydapalli) మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ గోదాంను (Single Window Society Warehouse) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Fertilizers | అక్రమంగా నిల్వ చేయవద్దు..
జిల్లాలో రైతులు తమకు సరిపడా ఎరువులు మాత్రమే తీసుకోవాలని.. స్టోరేజీ నిమిత్తం ఎరువులు కొనవద్దని కలెక్టర్ సూచించారు. అలాగే ఎవరైనా ఎరువులను నిల్వ చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించామన్నారు. బోధన్ (Bodhan) ప్రాంతం ఆయిల్ పామ్ (Oil palm) పంటకు అనుకూలంగా ఉంటుందని, రైతుల ఈ పంట సాగువైపు దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ దత్తాత్రి, ఎంపీడీవో శంకర్ నాయక్, తదితరులు ఉన్నారు.