Homeజిల్లాలునిజామాబాద్​EVM Godown | ఈవీఎం గోడౌన్​ను పరిశీలించిన కలెక్టర్

EVM Godown | ఈవీఎం గోడౌన్​ను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్​ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్​ను తెరిపించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: EVM Godown | జిల్లా కేంద్రంలోని వినాయకనగర్​లో గల ఈవీఎం గోడౌన్​ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ బుధవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్​ను తెరిపించారు.

ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్​లు, ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ (EVM godown) వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజేందర్ తదితరులు ఉన్నారు.

Must Read
Related News