Homeఆంధప్రదేశ్Cold Wave | రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

Cold Wave | రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

రాష్ట్రంలో మరోసారి చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా చలితీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cold Wave | రాష్ట్రంలో మరోసారి చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా చలితీవ్రత (cold wave) భారీగా పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిత్వా తుపాన్​ (Cyclone Ditva) ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు చలి తగ్గింది. అనంతరం మళ్లీ కోల్డ్​ వేవ్​ స్టార్ట్​ కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సింగిల్​ డిజిట్​ టెంపరేచర్ నమోదు అవుతోంది. ఆదివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 11.3,
హనుమకొండలో 13.5, రామగుండంలో 14.2, హైదరాబాద్‌లో (Hyderabad) 15.6, నల్గొండలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.

Cold Wave | మరింత పెరిగే అవకాశం

రాష్ట్రంలో కనిష్ణ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు (Metological department officials) తెలిపారు. చలి పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం చలి ప్రభావంతో రాత్రి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. చలి పెరగడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా బయట తిరగొద్దు. వెచ్చని దుస్తులు ధరించాలి. వాహనదారులు తెల్లవారుజామున ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం.

రానున్న మూడు రోజులు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. చలి తీవ్రత దృష్ట్యా ఏడు జిల్లాలకు వాతావారణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్​ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో చలి గాలులు తీవ్రంగా వీస్తాయని హెచ్చరించారు.

Must Read
Related News