Homeతాజావార్తలుWeather Updates | మళ్లీ పెరగనున్న చలి..

Weather Updates | మళ్లీ పెరగనున్న చలి..

తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రంలో శీతాకాలం (winter) ప్రారంభంలోనే చలి గజగజ వణికించింది. నవంబర్​ రెండో వారం నుంచి చలి తీవ్రత కొనసాగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.

శీతల గాలుల (cold winds) ప్రభావంతో సాయంత్రం ఆరు అయింది అంటే ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో పది డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో వారం రోజులుగా చలి తీవ్రత కొంతమేర తగ్గింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department officials) మరోసారి షాకింగ్​ న్యూస్​ చెప్పారు. రానున్న రోజుల్లో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ అంతటా సీజనల్ చలి ఉష్ణోగ్రతలు (cold temperatures) కొనసాగుతాయన్నారు. నవంబర్ 29, 30 తేదీల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. డిసెంబర్ మొదటి వారంలో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో డిట్వా తుపాన్​ (Cyclone Ditva) ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే చలి మాత్రం కొనసాగనుంది.

Weather Updates | మరో తుపాన్​ ముప్పు

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్​ తుపాన్​ (cyclone Senyar) ఇండోనేషియా వైపు కదులుతూ బలహీన పడుతోంది. ఈ తుపాన్​ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా లేదు. దీంతో అధికారులతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో తుపాన్​ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో వాయుగుండం బలపడి తుపాన్​గా మారింది. దీనికి దిట్వా అని పేరు పెట్టారు. రానున్న రోజుల్లో ఇది తీవ్రతరం కానుంది. దీని ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.