Homeతాజావార్తలుWeather Updates | తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

Weather Updates | తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పెరిగింది. ఇటీవల వారం రోజుల పాటు కాస్త పెరిగిన ఉష్ణోగ్రతలు మళ్లీ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు.

ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలితీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్​ (Cyclone Ditwah) ప్రభావంతో వారం రోజుల పాటు చలితీవ్రత తగ్గింది. మళ్లీ శుక్రవారం రాత్రి నుంచి కోల్డ్​ వేవ్​ ప్రారంభం అయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ఏజెన్నీ గ్రామాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Weather Updates | ఆసిఫాబాద్​లో 8.1 డిగ్రీలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా (Adilabad District)లో చలి పంజా విసరుతోంది. కొమురంభీమ్​ అసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో 8.1 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్​, నిజామాబాద్, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి పెరిగింది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో సైతం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్​లో శనివారం ఉదయం 12.3 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అయింది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12, చింతపల్లిలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Weather Updates | అప్రమత్తంగా ఉండాలి

చలి తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం సైతం చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం ఆరు అయిందంటే బయటకు వెళ్లలేని పరిస్థితి, ఉదయం పది గంటల వరకు సైతం చలి అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలి. రాత్రిపూట ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అత్యవసరం అయితేనే రాత్రి బయటకు వెళ్లాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి. ఆస్తమా రోగులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దు. గాలిపీల్చుకోవడంలో ఇబ్బంది అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Must Read
Related News