HomeతెలంగాణCM Revanth Reddy | ముగిసిన సీఎం రేవంత్​రెడ్డి జపాన్​ పర్యటన

CM Revanth Reddy | ముగిసిన సీఎం రేవంత్​రెడ్డి జపాన్​ పర్యటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి CM Revanth Reddy  జపాన్​ పర్యటన japan tour ముగిసింది. మంత్రి శ్రీధర్​బాబు minister sridhar babu, అధికారులతో కలిసి సీఎం జపాన్​ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులు investments తీసుకు రావడమే లక్ష్యంగా సీఎం ఈ నెల 16 నుంచి 22 వరకు జపాన్​లో పర్యటించారు. అక్కడ పలు సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. తెలంగాణ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో ఒప్పందాలు MOU కుదుర్చుకున్నారు. రూ.12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగ్గా.. వీటి ద్వారా దాదాపు 30,500 ఉద్యోగాలు Jobs రానున్నట్లు సమాచారం. అలాగే జపాన్​లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్​కామ్ TOMCOM​ అక్కడి సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.

సీఎం రేవంత్​రెడ్డి పర్యటనలో చివరి రోజైన మంగళవారం హిరోషిమా Hiroshimaలో పర్యటించారు. పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా విపత్తు నిరోధక నిర్మాణాలు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ పరిష్కారాల్లో హిరోషిమా అనుసరిస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని హైదరాబాద్‌లో ఉపయోగించే అవకాశాలపై చర్చలు జరిగాయి.

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ కేంద్రాల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్,  మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా జపాన్​ పర్యటన ముగియడంతో సీఎం రేవంత్​రెడ్డి బృందం బుధవారం హైదరాబాద్​ చేరుకోనునుంది.