Panchayat elections | సర్పంచ్​గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం రేవంత్​రెడ్డి స్నేహితుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchayat elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలిదశ నామినేషన్ల (Nominations) పర్వం ముగిసింది. చాలా గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్​ పదవి కోసం పోటాపోటీగా నామినేషన్లు వేశారు. కొన్ని గ్రామాల్లో మాత్రం గ్రామస్తులు అంతా ఏకమై ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నారు. నాగర్​కర్నూల్ (Nagarkurnool) జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి (Kondareddypalli) సీఎం రేవంత్​రెడ్డి స్వగ్రామం. అక్కడ తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రామపెద్దలు చర్చించి ఏకగ్రీవంగా సర్పంచ్​ ఎన్నిక […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchayat elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలిదశ నామినేషన్ల (Nominations) పర్వం ముగిసింది. చాలా గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్​ పదవి కోసం పోటాపోటీగా నామినేషన్లు వేశారు. కొన్ని గ్రామాల్లో మాత్రం గ్రామస్తులు అంతా ఏకమై ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నారు.

నాగర్​కర్నూల్ (Nagarkurnool) జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి (Kondareddypalli) సీఎం రేవంత్​రెడ్డి స్వగ్రామం. అక్కడ తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రామపెద్దలు చర్చించి ఏకగ్రీవంగా సర్పంచ్​ ఎన్నిక నిర్వహించారు. సర్పంచ్ పదవి కోసం మొత్తం 15 మంది పోటీ పడ్డారు. అందరితో మాట్లాడి గ్రామ పెద్దలు ఎన్నికను ఏకగ్రీవం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి బాల్య మిత్రుడు, క్లాస్​మేట్​ మల్లెపాకుల వెంకటయ్య సర్పంచ్​గా ఎన్నికయ్యారు. గ్రామస్తులంతా కలిసి ఆయనను ఎన్నుకున్నారు.

Panchayat elections | ఏకగ్రీవాల జోరు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. అయితే చాలా ప్రాంతాల్లో వేలంపాట ద్వారా ఏకగ్రీవాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో వీడీసీలు గ్రామానికి ఇంత ఇచ్చిన వారిని ఏకగ్రీవం చేస్తామని డిమాండ్​ చేస్తున్నట్లు తెలిసింది. బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...